vaccine: కేంద్రీకృత వ్యాక్సిన్‌ సేకరణ విధానాన్ని తీసుకురావాలి - ready to pay cost: delhi govt urges centre to procure vaccines as moderna pfizer deny sales to states
close
Updated : 25/05/2021 00:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vaccine: కేంద్రీకృత వ్యాక్సిన్‌ సేకరణ విధానాన్ని తీసుకురావాలి

దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా

దిల్లీ: మోడెర్నా, ఫైజర్‌ వంటి అంతర్జాతీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు వ్యాక్సిన్లను రాష్ట్రాలకు విక్రయించమని చెప్పడంతో కేంద్రీకృత వ్యాక్సిన్‌ సేకరణ విధానానాన్ని తీసుకురావాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా కేంద్రాన్ని కోరారు. మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు కొవిడ్‌-19 వ్యాక్సిన్లను నేరుగా దిల్లీ ప్రభుత్వానికి విక్రయించడానికి నిరాకరించాయని, తాము కేంద్రంతో మాత్రమే వ్యవహరిస్తామన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. ‘‘ఫైజర్‌, మోడెన్నాతో సహా ప్రపంచంలోని వివిధ వ్యాక్సిన్‌ తయారీదారులను దిల్లీ ప్రభుత్వం సంప్రదించింది. విదేశీ వ్యాక్సిన్‌ తయారీదారులంతా భారత ప్రభుత్వంతో మాత్రమే వ్యవహరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోలేమని చెప్పారు. దీంతో దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన గ్లోబల్‌ టెండర్లను తిరస్కరించడం సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూపాలి’’ అని కేంద్రాన్ని కోరారు. 

భారత ప్రభుత్వం టీకా ఉత్పత్తి, సరఫరాను నియంత్రిస్తోంది. అలాగే విదేశీ తయారీదారుల వ్యాక్సిన్‌ సరఫరాను కూడా నియంత్రిస్తోంది. దేశంలో అందరికీ టీకా అందించేలా పారదర్శకమైన, సమర్థవంతమైన విధానాన్ని తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు. 18-44 వయస్సు గల వారికి కావలసిన టీకాలు రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సిసోడియా విమర్శించారు. 18-44 వయస్సుగల వారికి కేంద్రం సేకరించిన వ్యాక్సిన్లకు అయ్యే ఖర్చును దిల్లీ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సిసోడియా తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని