IMF: భారత్‌కు సహకరించేందుకు సిద్ధం - ready to strengthen dialogue scale up technical collaboration with india during pandemic imf
close
Published : 21/05/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IMF: భారత్‌కు సహకరించేందుకు సిద్ధం

వెల్లడించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సహకారం అందించేందుకు సిద్ధమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని సంస్థ ప్రతినిధి జెర్రీ రైస్‌ అన్నారు. భారత్‌లో కరోనాతో పోరాడుతున్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారికి ఐఎంఎఫ్‌ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్‌లో కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఐఎంఎఫ్‌ గమనిస్తోంది.  అక్కడ టీకా ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు ఆరోగ్య రంగానికి ఆర్థిక వనరులు అందించడం చాలా ముఖ్యం. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారాన్ని ఆ దేశానికి అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా కొవిడ్‌ సహాయక కార్యక్రమాలు రెట్టింపు చేస్తాం’’ అని జెర్రీ రైస్‌ అన్నారు. మహమ్మారి సమయంలో భారత్‌కు అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకు రావడం మంచి పరిణామంగా ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. జులైలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ అప్డేట్‌ను ఐఎంఎప్‌ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 

కరోనాను ఎదుర్కొనేందుకు మనదేశం తీసుకున్న చర్యలను గతంలో ఐఎంఎఫ్‌ ప్రశంసించింది. భారత్‌కు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని