నయన్‌-విఘ్నేశ్‌.. విజయ్‌ దేవరకొండ-రష్మిక - real and reel couple photos viral in social media
close
Published : 25/03/2021 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయన్‌-విఘ్నేశ్‌.. విజయ్‌ దేవరకొండ-రష్మిక

ఒక్కసారిగా ఈ జంటలపై నెటిజన్ల చూపు

హైదరాబాద్‌: కోలీవుడ్‌ రియల్‌ కపుల్‌ నయనతార ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌, టాలీవుడ్‌ రీల్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ-రష్మిక.. వీళ్ల గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు నయన్‌-విఘ్నేశ్‌ ఓ లవ్లీ పిక్‌తో ఆశ్చర్యపర్చగా.. మరోవైపు విజయ్‌-రష్మికల పార్టీ ఫొటోలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఈ జంటల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఎంగేజ్‌మెంటా?కాదా?

నయన్‌, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారనేది ఓ బహిరంగ రహస్యం. ఒకానొక సమయంలో ప్రేమలో విఫలమైన నయన్‌కు ‘నేను రౌడీ నే’ సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. నయన్‌పై తనకున్న ప్రేమను విఘ్నేశ్‌ పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తెలియజేశాడు. కాగా, తాజాగా ఆయన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. అందులో నయన్‌ చేతికి ఉన్న ఉంగరం చూసి.. ఈ జంటకు నిశ్చితార్థమైందని అందరూ భావించారు. కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే, నయన్‌ వేలికి ఉన్న ఆ ఉంగరం.. గతేడాది విఘ్నేశ్‌ షేర్‌ చేసిన చాలా ఫొటోల్లో కనిపించింది. దీంతో ఈ జంటకు నిశ్చితార్థమైందా?లేదా?అనుకుంటున్నారు నెటిజన్లు.

డిన్నర్‌ పార్టీలో రీల్‌ పెయిర్‌

ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో రీల్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు ‘గీతగోవిందం’ జంట విజయ్‌ దేవరకొండ-రష్మిక. రెండు సినిమాల కోసం స్క్రీన్‌ పంచుకున్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ పలు సందర్భాల్లో వాటిని ఈ జంట ఖండిచింది. వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న వీరు చాలారోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కారు. సినిమా షూటింగ్స్‌లో భాగంగా ముంబయికి చేరుకున్న విజయ్‌, రష్మిక బుధవారం రాత్రి డిన్నర్‌ కోసం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. దీంతో ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో దర్శనమివ్వడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని