అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా! - reason behind why raghavedrarao wasnt introduce prabhas
close
Published : 13/02/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి ఎంతో మంది నటుల్ని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తొలి చిత్రం ఆయనతో చేస్తే చాలు నటనలో పాస్‌ అయినట్టేనని భావించే నాయకానాయికలెందరో ఉన్నారు. పైగా మాస్‌, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల వారి అభిమానం ఒకే చిత్రంతో సంపాదించుకోవచ్చనే భావనా ఉంటుంది. అందుకే అగ్ర నిర్మాతలు, నటులు సైతం  తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేసే ఆలోచన వచ్చిన వెంటనే రాఘవేంద్రరావుని సంప్రదిస్తుంటారు. ప్రభాస్‌ విషయంలోనూ ఇదే జరిగింది.  తనకు రాఘవేంద్రరావు సన్నిహితులు కావడంతో ప్రభాస్‌తో ఓ చిత్రం చేయమని అడిగారట ప్రభాస్‌ తండ్రి. హీరో అయ్యేందుకు తగిన మెళకువలు నేర్చుకున్నాడని మీ దర్శకత్వంలోనే తొలి చిత్రం రావాలని కోరారట. కానీ, అది సాధ్యమవలేదు.

‘ప్రభాస్‌ని నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు’ అని ఓ సందర్భంలో తెలియజేశారు రాఘవేంద్రరావు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి. దర్శకేంద్రుడికి కుదరకపోవడంతో ఈ అవకాశం జయంత్‌ సి. పరాన్జీకి దక్కింది. ఆయనే ప్రభాస్‌ని ‘ఈశ్వర్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా సాధారణ నటుడిగా వచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ‘రాధేశ్యామ్‌’, ‘సలార్‌’, ‘ఆది పురుష్‌’తోపాటు నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.

ఇదీ చదవండి..

నవ్వులు పంచుతున్న ‘జాతిరత్నాలు’ టీజర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని