close
Published : 15/01/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘కేజీయఫ్‌-2’ టీజర్‌ రికార్డు..

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ‘కేజీయఫ్‌-2’ విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌-2’ టీజర్‌ను చిత్రబృందం ఇటీవల అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా జనవరి 7న సాయంత్రం విడుదలైన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో వారం రోజుల్లోనే ఈ టీజర్‌ 150 మిలియన్ల వ్యూస్‌.. 7.5 మిలియన్ల లైక్స్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ మేరకు చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.

‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ కమ్స్‌ ఫ్రమ్‌ పవర్‌ఫుల్‌ ప్లేసెస్‌.. అని చరిత్ర మనకు చెబుతుంది. చరిత్ర తప్పు. ఎందుకంటే పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్‌ ప్లేసెస్‌ పవర్‌ఫుల్‌’ అంటూ సాగిన ‘కేజీయఫ్‌-2’ టీజర్‌ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మరోవైపు రవీనాటాండన్‌, రావు రమేష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి

ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని