అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత   - registration for amarnath yatra suspended
close
Published : 22/04/2021 19:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు నిలిపివేత 

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు. కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

జూన్‌ 28 నుంచి 56 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఏప్రిల్‌ 15నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఏటా జరిగే అమర్‌నాథ్ యాత్ర అప్పట్లో నెలకొన్న అసాధారణ పరిస్థితులతో గత రెండేళ్లుగా జరగలేదు. 2019లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో నెలకొన్న పరిస్థితులు కారణం కాగా.. 2020లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో యాత్రను రద్దుచేసిన విషయం తెలిసిందే. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని