‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ నిధుల విడుదల - release of ysr mathyakara bharosa funds
close
Published : 18/05/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ నిధుల విడుదల

అమరావతి: ఏపీలో మ‌త్స్య‌కారుల‌కు అండ‌గా ఉంటామ‌న్న మాట నిల‌బెట్టుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి ఆయ‌న‌ ఆన్‌లైన్ విధానంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. క‌రోనా సంక్షోభంలోనూ మ‌త్య్య‌కార భ‌రోసా కొన‌సాగిస్తున్నామ‌న్నారు. అధికారంలోకి రాగానే 2019లో ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టిన‌ట్లు గుర్తు చేశారు. కొవిడ్ స‌మయంలో ప్ర‌భుత్వానికి ఆర్థిక క‌ష్టాలున్నాయ‌ని అయినా.. పేద‌ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. వ‌రుస‌గా మూడో ఏడాది ఈ నిధులు ఇస్తున్న‌ట్లు చెప్పారు.

ప‌థ‌కాల్లో వివ‌క్ష‌కు తావు లేదు: జ‌గ‌న్‌

వేట‌కు వెళ్లి ప్ర‌మాద‌వశాత్తు చ‌నిపోతే రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. ఏపీలోని 1,19,875 మంది మ‌త్స్య‌కార‌ కుటుంబాల‌ను ఈ ప‌థ‌కం ద్వారా ఆదుకుంటున్నామ‌న్నారు. మ‌త్య్య‌కారుల కోసం 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి లీట‌ర్‌కు రూ.9 స‌బ్సిడీ ఇస్తున్నామ‌ని జ‌గ‌న్ అన్నారు. ఆక్వా సాగు రైతుల‌కు తోడుగా నిల‌బ‌డి ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఏ సంక్షేమ ప‌థ‌కంలోనైనా అవినీతికి, వివ‌క్ష‌కు తావు లేద‌ని వివ‌రించారు.

ప‌.గో. జిల్లాలో ఏపీ ఫిష‌రీస్ వ‌ర్సిటీ: సీఎం

ఆక్వా రైతుల‌కు నాణ్య‌మైన సీడ్ అందిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బ‌ర్ల‌ను నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. రెండో ద‌శ‌లో మ‌రో నాలుగింటిని ఏర్పాటు చేస్తామ‌న్నారు. వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 85 వేల మందికి ఉపాధి క‌లుగుతుంద‌ని వివ‌రించారు. వంద‌కు పైగా ఆక్వా హ‌బ్‌ల ఏర్పాటుకు కార్యాచ‌ర‌ణ రూపొందించిన‌ట్లు జ‌గ‌న్ అన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏపీ ఫిష‌రీస్‌ వ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దానికి ఈ ఏడాది శంకుస్థాప‌న చేసి ప‌నులు మొద‌లు పెడ‌తామ‌న్నారు. మ‌త్స్య‌కారుల‌కు శిక్ష‌ణ స‌హా విద్య‌, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. 

ఈ ప‌థ‌కం కింద రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చేపల వేటను నిషేధించిన సమయంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని