ప్రేక్షకులు లేకుండానే మిగతా టీ20లు - remaining t20 matches between india and england will be played without audience
close
Published : 15/03/2021 23:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేక్షకులు లేకుండానే మిగతా టీ20లు

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సంబంధించి గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(జీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మిగతా మూడు టీ20లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొతేరా (మోదీ స్టేడియం) వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగాయి. మిగతా మూడు మ్యాచ్‌ల కోసం టికెట్లు కోనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు జీసీఏ తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లో సోమవారం ఒక్కరోజే 890 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ చెరో మ్యాచ్‌ గెలిచాయి. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. మార్చి 16న మూడో టీ20 జరగనుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని