OLXలో రెమ్‌‌డెసివిర్‌ ఇంజెక్షన్లు - remdesivir sold in olx website
close
Published : 16/04/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

OLXలో రెమ్‌‌డెసివిర్‌ ఇంజెక్షన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకవైపు చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ కొరత ఉండగా.. కొందరు మాత్రం దీన్ని యథేచ్చగా ఏకంగా ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుజరాత్‌, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్‌ఎక్స్‌ యూజర్లు ఈ ఇంజెక్షన్లను వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో వయల్‌ను గరిష్ఠంగా రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 

సాధారణంగా ఓఎల్‌ఎక్స్‌లో ఎలాంటి మెడిసిన్ల విక్రయానికి అనుమతిలేదు. అలాంటిది కొవిడ్‌ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ను ఈ వెబ్‌సైట్లో విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లోని బ్లాక్‌ మార్కెట్‌లో వీటి‌ విక్రయాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. అంతేగాక, డిమాండ్‌ పెరుగుతుండడంతో కొందరు నకిలీ ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ ఔషధ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని