Revanth reddy: శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా: రేవంత్‌రెడ్డి - revanth reddy feeling regret about of comments on shashi tharoor
close
Updated : 17/09/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Revanth reddy: శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు రేవంత్‌ పేర్కొన్నారు. శశిథరూర్‌ను తాను అత్యంత గౌరవించే వ్యక్తినన్నారు. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో విధానాలు, విలువలతో పనిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అందరం కృషిచేస్తామన్నారు. ఇటీవల పార్లమెంటరీ ఐటీ స్థాయి సంఘం ఛైర్మన్‌ హోదాలో హైదరాబాద్‌ వచ్చిన శశిథరూర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఇదే విషయంపై రేవంత్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శశిథరూర్‌ స్పందించారు. రేవంత్‌రెడ్డి చింతిస్తున్నట్లు తనకు చెప్పారని శశిథరూర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలోపేతం కావడానికి మేమందరం ఒక్కటిగా కలిసి పనిచేస్తామన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని