RGV: భార్యలపై ఆర్జీవీ వెబ్‌సిరీస్‌... ప్రమోషనల్‌ వీడియో చూశారా - rgv new web series on rakarakala bharyalu
close
Updated : 25/07/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RGV: భార్యలపై ఆర్జీవీ వెబ్‌సిరీస్‌... ప్రమోషనల్‌ వీడియో చూశారా

హైదరాబాద్‌: స్త్రీల అసలు స్వరూపం వాళ్లు భార్యలుగా మారినప్పుడే విశ్వరూపమై బయటకు వస్తుందని అంటున్నారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా ఓ ఆకట్టుకునే అంశంపై వెబ్‌సిరీస్‌ చిత్రీకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భార్యలు.. వాళ్లల్లో రకాలు అనే అంశాన్ని చూపిస్తూ ఈ సిరీస్‌ రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆర్జీవీ ఓ ప్రమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు.

‘ఎంతోమంది మహాకవులు స్త్రీల స్వరూపాన్ని వివిధ రకాలుగా అభివర్ణించారు.. కానీ కాలమానంలో ఎన్నో రకాలైన స్త్రీలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు’ అని ఆర్జీవీ అన్నారు. ఇప్పటికాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియజేస్తూ ‘రకరకాల భార్యలు’ అనే పేరుతో సిరీస్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోరకం భార్యని చూపించనున్నట్లు వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని