దిల్లీలో దయనీయ స్థితి.. ఆర్జీవీ వీడియో - rgv shared delhi video
close
Published : 30/04/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో దయనీయ స్థితి.. ఆర్జీవీ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్‌వేవ్‌ మరింత భయానకంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ వందల  మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు శ్మశానాల్లో చోటు దొరకని దుస్థితి నెలకొంది. ఇప్పటివరకూ కేవలం ఒక్క దిల్లీలోనే 15వేల మందికి పైగా మరణించారు. ఆసుపత్రుల్లో కూడా బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్‌ సంగతి సరేసరి.

ఇదంతా ఇలా ఉండగా.. దిల్లీకి సంబంధించిన ఒక హృదయవిదారకమైన వీడియోను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పంచుకున్నారు. కరోనా బాధితులు కార్లు, ఆటోల్లోనే ఉండి ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకొని ఉన్న ఘోరమైన పరిస్థితి కనిపిస్తోంది. దిల్లీలో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ఏ దర్శకుడైనా ఇంతకంటే భయంకరమైన హార్రర్‌ చిత్రం తీయగలడా..?’ అంటూ ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని