RGV: రేవంత్‌ నియామకంపై ఆర్జీవీ ట్వీట్‌ - rgv tweet on pcc chief revanth reddy
close
Updated : 27/06/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RGV: రేవంత్‌ నియామకంపై ఆర్జీవీ ట్వీట్‌

ఆయన సింహంలాంటోడు!

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడం పట్ల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి.. సింహంలాంటి వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా రేవంత్‌ నియామకంతో చాలాకాలం తర్వాత తనకి కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆర్జీవీ తాజాగా ట్వీట్‌ చేశారు.

‘సింహం లాంటి వ్యక్తి రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న ఓ అద్భుతమైన నిర్ణయం. ఈ సింహాన్ని చూసి పులులన్నీ భయపడనున్నాయి. రేవంత్‌ నియామకంతో ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు కాంగ్రెస్‌ రాజకీయాలపై ఓ ఆసక్తి ఏర్పడింది. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

పీసీసీ చీఫ్‌గా ఎవర్ని ఎన్నుకుంటారనే విషయంలో ఎప్పటినుంచో సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అధ్యక్ష పీఠం కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్‌నే అధిష్ఠానం ఖరారు చేసింది. అధిష్ఠానం నిర్ణయం పట్ల పలువురు కాంగ్రెస్‌ నేతలు, రేవంత్‌ రెడ్డి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని