Cinema News: మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా - richa gangopadhyay blessed with a baby boy
close
Published : 05/06/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా

హైదరాబాద్‌: ‘మిర్చి’ నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. బాబుకి ‘లుకా షాన్‌’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ‘మా చిరు సంతోషం!! లుకా షాన్‌. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన నాన్నలాగానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అని రిచా రాసుకొచ్చారు.

‘లీడర్‌’ చిత్రంతో తెలుగుతెరకు రిచా గంగోపాధ్యాయ్‌ నటిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతో ఆకట్టుకున్న ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ‘భాయ్‌’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమయ్యారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని