దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వండి - rights groups urge priority vaccination for persons with disabilities
close
Updated : 20/01/2021 23:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వండి

టీకా పంపిణీ విషయమై ప్రధానికి లేఖ రాసిన హక్కుల సంఘాలు

దిల్లీ: భారత్‌లో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమంలో దివ్యాంగులకు ప్రాధాన్యతనివ్వాలని హక్కుల సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు 30కి పైగా హక్కుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు బుధవారం లేఖలు రాశాయి. వీరిలో జాతీయ వికలాంగుల ఉపాధి ప్రోత్సాహక కేంద్రం (ఎన్సీపీఈడీపీ), ఏక్తా సామ ఫౌండేషన్‌ ఉన్నాయి. దివ్యాంగులకు వ్యాక్సిన్‌ ముందుగా ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారు ఆ లేఖలో వెల్లడించారు. ఇతరులతో పోలిస్తే దివ్యాంగులకు పరిమిత వనరులు, ఇతరులపై ఆధారపడి చేసుకొనే దైనందిన కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఎన్సీపీఈడీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అర్మాన్‌ అలి మాట్లాడుతూ.. వ్యక్తిగత సహాయం అవసరమైనవారు, వైకల్యం ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారు వ్యాక్సిన్‌ను పొందడం చాలా అవసరమన్నారు. భవిష్యత్తు ప్రజారోగ్య ప్రణాళికల్లో వీరికి కచ్చితంగా ప్రాధాన్యతనివ్వాలన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వ్యాక్సిన్‌ ప్రణాళికను వేయాల్సిన అవసరముందన్నారు. ఏక్తా సహ వ్యవస్థాపకుడు రాజివ్‌ రాజన్‌ మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో చాలా మందికి చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. దివ్యాంగులకు వ్యాక్సినేషన్‌లో కచ్చితంగా ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు. కాగా దేశంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాను అందించారు. వారి తర్వాత యాభైఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌ గోడకు బైడెన్‌ బ్రేక్‌..

టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి.. లేదంటే..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని