పంత్‌.. రూట్‌.. స్టోక్స్.. గరం గరం..! - rishabh pant benstokes and joe root engaged in a heat exchange of words
close
Published : 14/02/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌.. రూట్‌.. స్టోక్స్.. గరం గరం..!

చెన్నై: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా 300/6 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్‌(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో రిషభ్‌పంత్‌(33) ధాటిగా ఆడి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే, శనివారం ఆట చివరి ఓవర్‌ సందర్భంగా పంత్‌.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జోరూట్‌, బెన్‌స్టోక్స్‌తో మాటల యుద్ధానికి దిగాడు. 

తొలి రోజు మొత్తం 88 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ 87వ ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే, పంత్‌ ఆ ఓవర్‌లో ఒక్కో బంతిని ఎదుర్కొనే క్రమంలో కాస్త ఆలస్యం చేశాడు. దాంతో తొలిరోజు ఆటను ఆ ఓవర్‌తోనే ముగిస్తారని భావించాడు. కానీ, పంత్‌ అనుకున్నట్లు జరగలేదు. ఆట నిలిచిపోయే సమయానికి ఇంకా ఒక నిమిషం ముందే రూట్‌ తన ఓవర్‌ను పూర్తి చేశాడు. దీంతో ఇంకో ఓవర్‌ ఆట సాగాల్సి వచ్చింది. బంతి అందుకున్న ఓలీస్టోన్‌ చివరి ఓవర్‌ను పూర్తి చేశాడు.

అయితే, స్టోన్‌ 88వ ఓవర్‌ వేయకముందు.. రూట్‌, స్టోక్స్‌, పంత్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఏదో అనుకోగా, తర్వాత స్టోక్స్‌ వచ్చి ఆజ్యం పోశాడు. దీంతో మళ్లీ పంత్, స్టోక్స్‌ మధ్య వాడీవేడీ సంభాషణలు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన తొలిరోజు ఆట చివర్లో ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది. కాగా, చివరి ఓవర్‌లో పంత్‌ ఒక బౌండరీ బాది నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు అతడికి అక్షర్‌ పటేల్‌(5) తోడుగా నిలిచాడు.

ఇవీ చదవండి..
ఏమైంది రోహిత్‌? విరాట్‌ అమాయక ప్రశ్న!
రోహిత్ 97.. రితికా గుండె లబ్‌..డబ్‌!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని