Covid-19: టీకా తొలిడోస్‌ తీసుకున్న పంత్‌ - rishabh pant takes first dose of vaccine
close
Published : 13/05/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid-19: టీకా తొలిడోస్‌ తీసుకున్న పంత్‌

(Photo: Rishabh Pant Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ గురువారం కొవిడ్-19 టీకా తొలిడోస్‌ తీసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకుని అతడే స్వయంగా వెల్లడించాడు. ‘ఈరోజే నా తొలి టీకా తీసుకున్నా. వాక్సినేషన్‌ తీసుకునేందుకు మీరు అర్హులైతే వెంటనే వేయించుకోండి. మనమెంత త్వరగా టీకాలు తీసుకుంటే వైరస్‌ను అంత త్వరగా నిర్మూలించొచ్చు’ అని పేర్కొన్నాడు.

కాగా, పంత్‌ గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన నుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతడు పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడటమే కాకుండా భారత్‌కు విశేషమైన ఫలితాలు సాధించాడు. అలాగే కరోనా కేసుల వల్ల మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించి జట్టును విజయపథంలో నడిపించాడు. ఇక అంతకుముందు టీమ్‌ఇండియా క్రికెటర్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సైతం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఉన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని