Rishabh pant: మళ్లీ.. మళ్లీ.. పంతే కీలకం! - rishabh pant will be kohlis team key player vs new zealand says kiran more
close
Published : 08/06/2021 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rishabh pant: మళ్లీ.. మళ్లీ.. పంతే కీలకం!

కిరణ్‌ మోరె అభిప్రాయం

ముంబయి: యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ మరింత మెరుగయ్యాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ కిరణ్‌ మోరె అన్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత జట్టుకు అతడు మళ్లీ కీలకమవుతాడని పేర్కొన్నారు. బ్యాటింగే కాకుండా కీపింగ్‌లో పరిణతి కనబరుస్తున్నాడని ప్రశంసించారు.

‘ఇంగ్లాండ్‌ సిరీసు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రిషభ్ పంత్‌ మరోసారి కీలకమవుతాడు. ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పుడైనా, ఏ స్థానంలోనైనా ఆటను మలుపు తిప్పగలనన్న ఆత్మవిశ్వాసం అతడిలో కనిపిస్తోంది’ అని కిరణ్‌ మోరె అన్నారు.

వికెట్ల వెనకాల సైతం పంత్‌ అదరగొడుతున్నాడని మోరె ప్రశంసించారు. ‘అతడనిప్పుడు చక్కగా కుదురుకున్నట్టు అనిపిస్తోంది. పంత్‌ ఇంగ్లాండ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్‌ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం మూడోది. అక్కడి పరిస్థితులు అతడికి బాగా తెలుసు. ఇంగ్లాండ్‌లో అతడు టెస్టు శతకం నమోదు చేశాడు. గ్లోవ్స్‌తోనూ అతడు మాయాజాలం సృష్టించగలడు’ అని ఆయన పేర్కొన్నారు.

కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసంతో రిషభ్ పంత్‌ కనిపిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా ముందుకు నడిపించాడు. సారథిగా విజయాలు అందించాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాలో ఏకంగా సిరీస్‌ విజయాన్నే అంందించి చరిత్ర సృష్టించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల్లో అతడు రాణించాలని టీమ్‌ఇండియా కోరుకుంటోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని