నేను రెడీ..అంటున్న ‘రాబర్ట్‌’ - robert movie lyrical video
close
Published : 08/02/2021 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను రెడీ..అంటున్న ‘రాబర్ట్‌’

హైదరబాద్‌: ‘కె.జి.ఎఫ్‌’ చిత్రం ఘన విజయంతో కన్నడ చిత్రపరిశ్రమ రేంజ్‌ పెరిగింది. ప్రస్తుతం శాండిల్‌వుడ్‌ అగ్రనటులు కన్నడంతో పాటు మిగిలిన బాషల్లోనూ తమ సినిమాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగానే కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ కూడా తన ‘రాబర్ట్‌’ సినిమా ద్వారా తెలుగులో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. ఆయన్ను అభిమానులు ముద్దుగా ‘D బాస్‌’ అని పిలుచుకుంటారు. ఇటీవల విడుదల ‘రాబర్ట్‌’ టీజర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. తాజాగా ఆ చిత్రంలోని ‘రా రా..నేన్‌ రెడీ’అనే సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. అర్జున్‌ జన్యా సంగీత సారథ్యంలో సాయి చరణ్‌, సాకేత్‌ మొదలగువారు ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. తరుణ్‌ కిషోర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఉమాపతి ఫిల్మ్‌ నిర్మిస్తోంది. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. మార్చి 11నుంచి ‘రాబర్ట్‌’ ప్రేక్షకులను థియేటర్లలో ఆలరించనుంది. మరి మంచి మాస్‌ బీట్‌తో సాగుతున్న ఆ సాంగ్‌ లిరికల్‌ వీడియోను మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

మీకేం తెలుసని నన్ను తిడుతున్నారు?: అనసూయ

మళ్లీ.. మళ్లీ.. అందాలు జల్లి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని