బ్యాటింగ్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా - rohit sharma and shubhman gill started batting
close
Published : 08/01/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాటింగ్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించింది. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్‌ (131) టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. శుక్రవారం 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. స్మిత్‌, లబుషేన్‌(91) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆపై మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ఇక టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించగా 4 ఓవర్లకు వికెట్లేమీ పడకుండా 11 పరుగులు చేసింది.

ఇవీ చదవండి..

స్మిత్‌ శతకం.. ఆస్ట్రేలియా 338 

పంత్‌పై పాంటింగ్‌ రుసరుసమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని