INDvsENG: రోహిత్‌ ఔట్‌.. భోజన విరామం.. భారత్‌ 97/1 - rohit sharma out
close
Updated : 05/08/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: రోహిత్‌ ఔట్‌.. భోజన విరామం.. భారత్‌ 97/1

నాటింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా రెండో రోజు శుభారంభం చేసింది. అయితే, భోజన విరామ సమయానికి ముందు ఓపెనర్‌ రోహిత్‌శర్మ (36; 107 బంతుల్లో 4x6) ఔటయ్యాడు. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి సామ్‌కరన్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 97 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మరోవైపు కేఎల్‌ రాహుల్‌(48; 124 బంతుల్లో 4x8) అర్ధశతకానికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కన్నా భారత్‌ 86 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు టీమ్‌ఇండియా 21/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో గురువారం రెండో రోజు ఆటను కొనసాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్‌, రాహుల్‌ ఎంతో సహనంతో బ్యాటింగ్‌ చేశారు. ఏ మాత్రం భారీ షాట్లకు వెళ్లకుండా ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించి శుభారంభం చేశారు. చివరికి రోహిత్‌ 37.3 ఓవర్‌కు పెవిలియన్‌ చేరాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని