కోహ్లీకి రోహిత్‌ కంగ్రాట్స్‌: ఫ్యాన్స్‌ హ్యాపీ - rohit sharma wishes to virushka
close
Updated : 12/01/2021 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీకి రోహిత్‌ కంగ్రాట్స్‌: ఫ్యాన్స్‌ హ్యాపీ

ఇంటర్నెట్‌డెస్క్: విరుష్కకు నెట్టింట్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత సారథి విరాట్ కోహ్లీ సోమవారం తండ్రయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. విరుష్క గారాల పట్టికి  సచిన్ తెందుల్కర్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ, యుజువేంద్ర చాహల్‌, హర్భజన్‌ సింగ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, డేవిడ్ వార్నర్‌, సూర్యకుమార్‌ యాదవ్, కేదార్ జాదవ్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు.

అయితే విరాట్ పోస్ట్‌కు వార్నర్‌ శుభాకాంక్షలు చెప్పి సరదాగా కామెంట్ చేశాడు. తండ్రిగా ఏమైనా సూచనలు కావాలంటే నేరుగా మెసేజ్‌ చేయి అని అన్నాడు. మరోవైపు రోహిత్‌ ‘ఇదో అద్భుతమైన అనుభూతి. ఇద్దరికి శుభాకాంక్షలు. దేవుడి ఆశీస్సులు’ అని పేర్కొంటూ కోహ్లీ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. కాగా, టీమిండియా అభిమానులు సంతోషంతో హిట్‌మ్యాన్‌ పోస్ట్‌కు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ-రోహిత్‌ మధ్య విభేదాలున్నాయని గత కొన్నినెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీకి హిట్‌మ్యాన్‌ శుభాకాంక్షలు చెప్పడంతో అవన్నీ వదంతులేని స్పష్టమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి

తండ్రయిన విరాట్‌ కోహ్లీ

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని