సచిన్‌-దాదా తర్వాత శిఖర్‌-రోహితే - rohit shikar 5000 plus partnership runs in odis
close
Updated : 29/03/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌-దాదా తర్వాత శిఖర్‌-రోహితే

వన్డేల్లో 5000+ పరుగులు చేసిన ఓపెనింగ్‌ జోడీ

పుణె: టీమ్‌ఇండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సాధించారు. వన్డేల్లో 5000+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత అందుకున్న ఏడో ఓపెనింగ్‌ జోడీగా చరిత్ర సృష్టించారు.

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనింగ్‌ జోడీ 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శిఖర్‌ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4) అర్ధశతకం సాధించాడు. చక్కని బౌండరీలతో చెలరేగాడు. అతడికి తోడుగా రోహిత్‌ (37; 37 బంతుల్లో 6×4) సైతం దూకుడుగానే ఆడాడు. దీంతో వీరి భాగస్వామ్యం మొత్తంగా 5000 పరుగులు దాటేసింది.

వన్డేల్లో అందరికన్నా ఎక్కువ పరుగులను సాధించిన ఓపెనింగ్‌ జోడీ సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీదే. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8227 పరుగులు చేయడం ప్రత్యేకం. ఆ తర్వాత మరెవ్వరూ వీరిని సమీపించలేదు. సంగక్కర-జయవర్దనె 5992, దిల్షాన్‌-సంగక్కర 5475, జయసూర్య-ఆటపట్టు 5462, గిల్‌క్రిస్ట్‌-హెడేన్‌ 5409, గ్రీనిడ్జ్‌-హెయిన్స్‌ 5206 పరుగులతో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్‌-శిఖర్ జోడీ ప్రవేశించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని