పంత్‌ను వదిలేశాం.. మీరూ వదిలేస్తారా? - rohitsharma feels rishabh pant should be left freely to deliver match winning knocks
close
Published : 11/03/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌ను వదిలేశాం.. మీరూ వదిలేస్తారా? 

మీడియాకు రోహిత్‌ శర్మ సూటి ప్రశ్న..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌పై ఒత్తిడి లేకుండా వదిలేస్తే మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని, అందుకోసం టీమ్‌ఇండియా కట్టుబడి ఉందని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన హిట్‌మ్యాన్‌.. పంత్‌ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పాడు. అతడిని ఎంత వదిలేస్తే అంత బాగా రాణిస్తాడని అన్నాడు.

‘మేం పంత్‌ను వదిలేశాం. తనకు ఇష్టమొచ్చినట్లు ఆడడానికి స్వేచ్ఛనిచ్చాం. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అందుకు సిద్ధంగా ఉంది. అయితే, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయదల్చుకున్నా. మీరు పంత్‌ గురించి ఆలోచించకుండా ఉంటారా?అతడిని వదిలేస్తారా? అందుకు సిద్ధంగా ఉన్నారా?’ అని రోహిత్‌ మీడియాను అడిగాడు. ‘అతడిని సహజసిద్ధమైన ఆటే ఆడనివ్వండి. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. ఇక నుంచి పంత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆసీస్‌, ఇంగ్లాండ్‌ జట్లపై మెరుగైన ప్రదర్శన చేశాడు. మీడియా ఒత్తిడి తేవడం తప్పించి అతడిని మరేదీ ఆపలేదు’ అని రోహిత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కాగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముందు వరకు పంత్‌ ఫామ్‌లేమి, షాట్ల ఎంపికతో తడబడిన సంగతి తెలిసిందే. దాంతో చాలాకాలం సరైన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ తర్వాత అనూహ్యంగా కంగారూలతో టెస్టు సిరీస్‌ ఆడిన అతడు చెలరేగిపోతున్నాడు. అక్కడ సిరీస్‌ గెలిపించడమే కాకుండా, స్వదేశంలోనూ ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడీ యువ బ్యాట్స్‌మన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా పంత్‌ విషయంలో అనవసరంగా కలగజేసుకోవద్దని రోహిత్‌ సూచించాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని