భయపెట్టి నవ్వులు పంచుతోన్న ‘రూహీ’ - roohi trailer
close
Published : 16/02/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపెట్టి నవ్వులు పంచుతోన్న ‘రూహీ’

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రూహీ’.  హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.  హారర్‌, కామెడీ సమపాళ్లలో చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. జాన్వీ నటన ప్రధానంగా నిలుస్తుంది.

ఇద్దరు యువకులు నాయికను కిడ్నాప్‌ చేసి ఓ అడవిలో నిర్బంధిస్తారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించే సందర్భాల్లో ఒక్కోసారి భయపెడుతుంది.. మరోసారి సాధారణంగా ఉంటుంది జాన్వీ. అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఆమెలో ఎవరి ఆత్మ ప్రవేశించింది? ఆమె నుంచి రక్షించుకునేందుకు ఆ యువకులు ఏం చేశారు? అసలు జాన్వీని కిడ్నాప్‌ ఎందుకు చేశారు? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. దినేష్‌ విజన్‌, మృఘ్‌దీప్‌ సింగ్‌ లంబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సచిన్‌-జిగర్‌ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని