close
Published : 09/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రౌడీ బాయ్స్‌’ మోషన్‌ పోస్టర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హుషారు’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హర్ష కొనుగంటి. ఇప్పుడాయన ‘రౌడీ బాయ్స్‌’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఆశిష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌ ఇందులో నాయిక. తాజాగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘మా బాయ్స్‌తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం.. జర ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం.. వియ్‌ ఆర్‌ ది రౌడీ బాయ్స్‌’ నేపథ్య గీతంతో వీడియో ఆకట్టుకుంటోంది. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీ విద్యార్థుల మధ్య సాగే కథ ఇది. ప్రేమ, యాక్షన్‌, డ్రామా నేపథ్యంలో రూపొందుతున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని