సాయికుమార్‌ గొంతుతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డైలాగ్‌ - rrr dailogue with saikumar voice
close
Published : 17/06/2021 19:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయికుమార్‌ గొంతుతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డైలాగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లురి సీతారామరాజు ఎంట్రీకి ఎన్టీఆర్‌కు కాకుండా.. సాయికుమార్‌ డైలాగ్‌ చెప్తే..!ఏముంది సాయికుమార్‌ ఆమాత్రం చేయలేరా అనుకుంటున్నారా..? ఆయన చెప్తే పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ.. సాయికుమార్‌ గొంతుతో వేరొకరు చెప్తే విశేషమే కదా.! మిమిక్రీ ఆర్టిస్టు షరీఫ్‌ ఆ డైలాగ్‌ను అచ్చం సాయికుమార్‌ చెప్పినట్లుగానే చెప్పి వారెవ్వా అనిపించాడు. జబర్దస్త్‌ కమెడియన్‌ వెంకీమంకీ తన వెంట్రిక్వాలిజం(బొమ్మతో మాట్లాడించడం)తో మరోసారి అలరించాడు. ప్రముఖ నటుడు సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘వావ్‌3’లో బుల్లితెర తారలు జబర్దస్త్‌ వెంకీ, అశ్విని, మిమిక్సీ షరీఫ్‌, డాలీ పాల్గొని సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం జూన్‌ 22న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని