ఇంటర్నెట్ డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి సినిమా తీస్తే ప్రేక్షకులను వందశాతం అలరించాల్సిందే.. అందుకే సమయం కాస్త ఎక్కువగానే తీసుకుంటారు. మిగతా డైరెక్టర్లు సంవత్సరానికో సినిమా చొప్పున విడుదల చేస్తుంటే ఆయన మాత్రం నిదానంగా రెండుమూడేళ్లు తీసుకొని ఒక సినిమాను జనంలోకి విడుస్తారు. ఆయన సినిమాలకు క్రేజ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది మరి. అందుకే జక్కన్న ఎప్పుడు సినిమా అప్డేట్ ఇస్తారా..? అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి కూడా అభిమానులు అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు. పైగా ప్రతి పండగకు ఏదో ఒక శుభవార్త చెప్పే ఆయన ఈసారి సైలెంట్ అయిపోయారు. దీంతో అభిమానులకు కాస్త అసహనానికి గురవుతున్నారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’పై సెటైర్లు వేస్తున్నారు.
ఓ అభిమాని ఏకంగా ‘ఆర్ఆర్ఆర్ రాజమౌళి కుటీరం’ పేరుతో కార్టూన్లు వేసి ట్విటర్లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో రామ్‌చరణ్, తారక్ నిల్చొని ఉండగా.. ఇద్దరు మహిళలు ముగ్గులు వేస్తూ ఉంటారు. ‘అక్కా ఇంతకీ సినిమా రిలీజ్ ఎప్పుడు..?’ అని చెల్లి ప్రశ్నించగా.. ‘తప్పమ్మా.. తెలియనివి అడక్కూడదు’ అంటూ ఆ అక్క జవాబిస్తుంది. అయితే.. ఈ సెటైర్‌పై చిత్రబృందం స్పందించింది. ‘సృజనాత్మకతో కూడిన సెటైర్.. చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ రీట్వీట్ చేసింది. దీంతో సినిమా అప్డేట్ చెప్పండి సార్.. అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్‌దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు అభిమానులను బాగా ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి.
ఇదీ చదవండి...
ఆ వీడియోకాల్‌ను హ్యాక్ చేసిందెవరు..?
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
- ‘రొమాంటిక్’గా వచ్చేది ఆ రోజే!
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా