RRR: అదే షాట్‌తో ముగిసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌.. తాజా అప్‌డేట్‌ ఏంటంటే? - rrr movie has wrapped up the entire shoot
close
Published : 26/08/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: అదే షాట్‌తో ముగిసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌.. తాజా అప్‌డేట్‌ ఏంటంటే?

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. కేవలం కొన్ని చిన్న చిన్న షాట్స్‌ తప్ప సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్వీట్‌ చేసింది.

‘‘కొన్ని కొన్ని చిన్న షాట్స్‌ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. 2018 నవంబరు 19న ఏదైతే బైక్‌ షాట్‌తో షూటింగ్‌ మొదలు పెట్టామో అదే బైక్ షాట్‌తో షూటింగ్‌ పూర్తవడం నిజంగా యాదృచ్ఛికం. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని అప్‌డేట్‌ త్వరలోనే ఇస్తాం’’ -ట్విటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌

ఇటీవల ఉక్రెయిన్‌ వెళ్లిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీమ్‌ కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను చిత్రీకరించింది. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌ అలరిస్తోంది. పీరియాడిల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌లు నటిస్తున్నారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 13, 2021న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని