RRR: ఆ రెండు మినహా షూటింగ్‌ పూర్తి! - rrr movie shoot update ram charan ntr rajamouli
close
Updated : 29/06/2021 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఆ రెండు మినహా షూటింగ్‌ పూర్తి!

డబ్బింగ్‌ షురూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర షూటింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు, తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో విడుదల తేదీ అక్టోబరు 13, 2021గానే చిత్ర బృందం పేర్కొంది. మరి అనుకున్న సమయానికే ఈ సినిమాను తీసుకొస్తారా? కొత్త తేదీని ప్రకటిస్తారా? చూడాలి. 

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి ‘ఆర్‌ఆర్ఆర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కుమురం భీంగా దర్శనమివ్వనున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారు’.- ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని