సరిగమ సినిమాస్‌కు అమెరికా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హక్కులు‌ ‌ - rrr movie usa theatrical rights acquired sarigama cinemas
close
Published : 08/04/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిగమ సినిమాస్‌కు అమెరికా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హక్కులు‌ ‌

ఇంటర్నెట్‌ డెస్క్:  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌.). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా అమెరికా థియేటర్‌ హక్కుల్ని సరిగమ సినిమాస్‌, రఫ్తార్‌ క్రియేషన్స్ పంపిణీ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ విషయంపై ఆ సంస్థలు ట్విటర్‌ వేదికగా స్పందించాయి. ‘‘భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను పొందామని చెప్పడానికి మాకెంతో గర్వంగా ఉంది’’ అని వెల్లడించాయి. అంతేకాదు, ఈ సినిమా ప్రిమియర్‌ షోను అక్టోబర్‌ 12న అమెరికాలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా హక్కులను తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ దక్కించుకోగా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెన్ స్టూడియోస్ సొంతం చేసుకున్నాయి. అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కులను సైతం పెన్ స్టూడియోస్ కొనుగోలు చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు. అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని