RRR: తీపి కబురు వినిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ - rrr surprise on july 15 starring ram chran ntr rajamouli
close
Published : 11/07/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: తీపి కబురు వినిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం ఓ తీపి కబురు వినిపించింది. ఈ క్రేజీ ప్రాజెక్టును ఎలా చిత్రీకరించారో చూడాలనుకునే వాళ్లకి ఓ సర్‌ప్రైజ్‌ అందించనుంది. ‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో మేకింగ్‌ వీడియో గ్లింప్స్‌ని జులై 15న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. మరి ఈ వీడియోలో.. చిత్రీకరించిన ప్రదేశాల్ని చూపిస్తారా? సినిమాలోని పాత్రలకి సంబంధించిన సన్నివేశాల్ని చూపిస్తారా? అంటే వేచి చూడాల్సిందే.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ దర్శనమివ్వనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ నాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయినట్టు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని