RRR: తారక్‌ ప్రేయసి జెన్నీఫర్‌ ఆగయా - rrr update
close
Published : 29/01/2021 11:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: తారక్‌ ప్రేయసి జెన్నీఫర్‌ ఆగయా

ఒలీవియా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ షేర్‌ చేసిన టీమ్‌

హైదరాబాద్‌: తారక్‌-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె తారక్‌ ప్రేయసిగా జెన్నీఫర్‌ పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం ఒలీవియా మోరీస్‌ పుట్టినరోజు సందర్భంగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అనంతరం తారక్‌ సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘హ్యాపీ బర్త్‌డే డియర్‌ జెన్నీఫర్’ అని ట్వీట్‌ చేశారు.

దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ చెర్రీకి జోడీగా సీత పాత్రలో సందడి చేయనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి

ప్రభాస్‌ ఎంట్రీ మామూలుగా ఉండదట..!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని