RRR: ఆర్‌.ఆర్‌.ఆర్‌... ఆ భాషల్లోనూ - rrr will also release in five foreign languages
close
Updated : 27/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఆర్‌.ఆర్‌.ఆర్‌... ఆ భాషల్లోనూ

గ్ర దర్శకుడు  రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. చైనీస్‌, జపనీస్‌ భాషల్లోనూ  విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. అదే తరహాలోనే తన కొత్త చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’నీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లోనూ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని, శాటిలైట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌, దాదాపు పది భాషల్లో హక్కుల్ని అమ్మింది. ఆ మేరకు ఆయా విదేశీ భాషలకి చెందిన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టు పెన్‌ స్టూడియోస్‌ తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన డిజిటల్‌ హక్కుల్నేమో జీ5, హిందీ డిజిటల్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. శాటిలైట్‌ హక్కుల్నేమో హిందీలో జీ సినిమా, దక్షిణాదిలో డిస్నీ స్టార్‌ సంస్థ చేజిక్కించుకుంది. ఈ ఒప్పందాలు భారతీయ సినీ  పరిశ్రమలోనే అత్యధిక విలువతో కూడుకున్నవని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌   చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. అలియాభట్‌, ఒలివియా మోర్రిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవగణ్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే చిత్రమిది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని