RoarOfRRRను మరిపించే వీడియో.. వారెవ్వా! - rrroar of rrrmovie fan made vidoa impress the rrr team
close
Published : 19/07/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RoarOfRRRను మరిపించే వీడియో.. వారెవ్వా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ప్రకటన మొదలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఏది విడుదలైన అది సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్లడం పక్కా.. అది తారక్‌, రామ్‌చరణ్‌ ఇంట్రో మొదలు.. ఫస్ట్‌లుక్‌లు.. తాజాగా విడుదలైన మేకింగ్‌ వీడియో.. ఇలా అప్డేట్‌ ఏదైనా నెట్టింట్లో ఎక్కడ చూసినా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హడావుడి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టీమ్‌ మీద ఉన్న ఆసక్తి అది. జక్కన్న నుంచి అద్భుతాలే జాలువారుతాయన్న నమ్మకం. అంతేకాదు.. రాజమౌళి ఏ అప్డేట్‌ ఇచ్చినా అది అభిమానులకు కచ్చితంగా నచ్చే తీరుతుంది. అలాంటి జక్కన్న టీమ్‌ను ఒక వీడియో తెగ నచ్చేసింది. ఓ అభిమాను RRRoar పేరుతో ఓ వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ఇంట్రోలతో పాటు తాజాగా విడుదల చేసిన మేకింగ్‌ వీడియోను జోడించి ఒక అద్భుతమే చేశాడా నెటిజన్‌. కాగా.. ట్విటర్‌లో దానిపై ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం స్పందించింది. Loved it!! శెభాష్‌ అంటూ ప్రశంసలు కురిపించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను ఎందుకంతలా ఆకట్టుకోగలిగిందో తెలుసుకోవాలంటే.. ఈ వీడియోపై ఓ లుక్కేయాల్సిందే మరి.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కుతోంది. అలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రమిది. అల్లూరిగా రామ్‌చరణ్‌ నటిస్తుండగా.. భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని