Tokyo Olympics: హరియాణా హాకీ క్రీడాకారులకు ₹ 2.5 కోట్ల నజరానా - rs 25000000 crore jobs land for 2 haryana players in india mens hockey team
close
Published : 05/08/2021 21:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: హరియాణా హాకీ క్రీడాకారులకు ₹ 2.5 కోట్ల నజరానా

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన పురుషుల హాకీ జట్టులోని హరియాణా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు రూ.2.5 కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. దాంతోపాటు క్రీడా శాఖలో ఉద్యోగం, రాయితీపై ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ట్విటర్‌ వేదికగా గురువారం వెల్లడించారు. పురుషుల హాకీ జట్టు ఫొటోను కూడా ఆయన ఆ ట్వీట్ ద్వారా షేర్‌ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా హాకీ జట్టులో తమ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లు వివేక్‌ సాగర్‌, నీలకంఠలకు రూ. కోటి చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. పంజాబ్‌ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. 

 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని