ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా - rss chief mohan bhagwat tests covid 19 positive and hospitalised
close
Published : 10/04/2021 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా

నాగ్‌పూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరెస్సెస్‌ తెలిపింది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్‌ పరీక్షలు చేయగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని పేర్కొంది. ఆయనకు కొవిడ్‌ వార్డులో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని