ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త వైద్య మృతి - rss ideologist mg vidhya passes away
close
Published : 19/12/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త వైద్య మృతి

నాగ్‌పూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సిద్ధాంత కర్త, సంస్కృత భాషా పండితుడు ఎంజీ వైద్య (97 సంవత్సరాలు) శనివారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఇటీవల నాగ్‌పూర్‌లోని స్పందన ఆస్పత్రిలో చేరిన వైద్య.. ఈ రోజు తుది శ్వాస విడిచినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నాగ్‌పూర్‌లోని అంబజారీ ఘాట్‌లో ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఎంజీ వైద్య మృతి పట్ల నివాళులు అర్పించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు వైద్య అందించిన సేవలు అమితమైనవి. బాబూరావ్‌ వైద్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నా. పరమ్‌పూజ్య గురూజీతో కలిసి వైద్య విశేషమైన కృషి చేశారు. సంఘ్‌ సైద్ధాంతిక నిర్మాణంలో వైద్య పాత్ర కీలకమైనది. ఆయన చివరి శ్వాస వరకు సంఘ్‌ ఆశయాల కోసం జీవితాన్ని అంకితం చేశారు. ‘నాగ్‌పూర్‌ తరుణ్‌ భారత్‌’ సంపాదకుడిగా ఆయన జర్నలిజం వృత్తిలో ఉన్నవారికి ఎంతో ఆదర్శంగా నిలిచారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

భాజపాలో చేరిన సుబేందు అధికారిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని