CSK.. నిన్న పేసర్‌.. నేడు బ్యాటర్‌కు కరోనా - ruthraj tested covid positive
close
Published : 29/08/2020 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CSK.. నిన్న పేసర్‌.. నేడు బ్యాటర్‌కు కరోనా

రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు వైరస్‌ సోకిందని సమాచారం

(Twitter Image/CSK)

దుబాయ్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌కు‌ వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో ఆటగాడికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం చేసిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా ధ్రువీకరణ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఫ్రాంచైజీలో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య మొత్తంగా 13కు చేరింది. ఒకే బృందంలో అంతమందికి వైరస్‌ సోకిందంటే పరిస్థితి కష్టమేనని అనిపిస్తోంది.

ప్రస్తుతం వైరస్‌ సోకిన ఆటగాడు టాప్‌ ఆర్డర్‌లో ఆడతాడని తెలిసింది. ఈ మధ్యే భారత్‌-ఏకు ఎంపికయ్యాడని, టాప్‌ ఆర్డర్‌లో ఆడతాడని, రంజీల్లో పరుగుల వరద పారించాడని సమాచారం. దాంతో మహారాష్ట్ర యువ క్రికెటర్‌ రుత్‌రాజ్‌‌ గైక్వాడ్ పైనే అనుమానాలు నెలకొన్నాయి. 2018-19 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రుతురాజ్‌ పరుగుల వరద పారించాడు. మహారాష్ట్ర తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అందుకే 2019 వేలంలో అతడిని చెన్నై కొనుగోలు చేసింది.

ఇప్పటికే సురేశ్‌ రైనా పూర్తిగా టోర్నీకి దూరమయ్యాడు. జట్టులో చాలామంది కొవిడ్‌ రావడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతోనే అతడు తిరిగి భారత్‌కు పయనమవుతున్నాడని అంటున్నారు. 13 మందికి వైరస్‌ సోకడంతో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా? ఆడేందుకు మొగ్గు చూపుతారా? అన్నది అనుమానంగా మారింది.

ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. వైరస్‌ ఇంక్యుబేషన్‌కు కాలం ఎక్కువే కాబట్టి ఇంకెంత మందికి పాజిటివ్‌ వస్తుందోనని అందరూ భయపడుతున్నారు. బహుశా క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని