Sachin: ఆయన కృషికి ఎంత రుణపడినా తక్కువే: సచిన్‌ - sachin tendulkar pays tribute to his coach acherekar on gurupurnima day
close
Published : 24/07/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sachin: ఆయన కృషికి ఎంత రుణపడినా తక్కువే: సచిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి సచిన్‌ తెందూల్కర్‌ శుక్రవారం తన ఆరాధ్య గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌కు నివాళులర్పించాడు. ఈరోజు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన నివాసానికి వెళ్లి మరీ అచ్రేకర్‌ ఫొటోకు పూలు సమర్పించి నమస్కరించాడు. అందుకు సంబంధించిన వీడియోను మాస్టర్‌ బ్లాస్టర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.

‘గురు పూర్ణిమ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అచ్రేకర్‌ సర్‌ ఇంటికి వెళ్లి నివాళులర్పించాను. ఒక్కసారిగా గత జ్ఞాపకాలన్నీ కళ్లముందు కదలాడాయి. నా జీవితంలో ఆయన చేసిన కృషికి ఎంత రుణపడినా తక్కువే’ అని సచిన్‌ మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, సచిన్‌ దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడానికి ముఖ్య కారణం అచ్రేకరే అనే సంగతి అందరికీ తెలిసిందే. పాఠశాల స్థాయిలోనే ఆయన వద్ద శిక్షణ పొందిన మాస్టర్‌ బ్లాస్టర్‌ అనతికాలంలోనే మంచి క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఆపై 16 ఏళ్లకే టీమ్‌ఇండియా జెర్సీ ధరించి తర్వాత 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ఈ క్రమంలోనే ప్రతి గురుపూర్ణిమ సందర్భంగా తెందూల్కర్‌ ఏటా తన గురువును కలిసి శుభాకాంక్షలు చెప్పేవాడు. కానీ, అచ్రేకర్‌ 2019 జనవరి 2న తుదిశ్వాస విడవడంతో అప్పటి నుంచి ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పిస్తున్నాడు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని