భారత్‌ టీకాకే మా ఓటు.. కొన్నాళ్లు ఆగుతాం - safety concern looms over indians 41 percent will choose to wait
close
Updated : 14/01/2021 04:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ టీకాకే మా ఓటు.. కొన్నాళ్లు ఆగుతాం

టీకాపై ప్రజల అభిప్రాయాలు వెల్లడించిన సర్వే

దిల్లీ: మరి కొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు వ్యాక్సిన్లు చేరుకున్నాయి. మరి ఇంతకీ ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అసలు వ్యాక్సిన్‌పై వారి అభిప్రాయాలేంటి? వీటిపై యూజీవోవీ అనే సంస్థ ఒక సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో పలు కీలక అంశాలు వెలువడ్డాయి. ఎక్కువశాతం (68%) ప్రజలు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 24శాతం మంది వ్యాక్సిన్‌పై ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని తెలుపగా, 8శాతం ప్రజలు మాత్రం తాము వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్ధంగాలేమని తెలిపారు. సగం కన్నా ఎక్కువ మంది (55%) విదేశీ టీకాలకన్నా భారత టీకాకే తమ ఓటని తెలిపారు. టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత కొన్నాళ్లు ఆగిన తర్వాత టీకా తీసుకుంటామని 41శాతం మంది తెలిపారు. 33 శాతం మంది వ్యాక్సిన్‌ రాగానే తీసుకుంటామని తెలుపగా 13శాతం మంది మాత్రం టీకా తప్పనిసరి అంటేనే తీసుకుంటామని తెలుపుతున్నారు. ఈ నివేదికల్లో 50శాతం మంది ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని సూచిస్తున్నారు. 36శాతం మాత్రం పేదలకు ఉచితంగా అందిస్తే చాలంటున్నారు. మిగిలిన వారు వ్యాక్సిన్‌ కోసం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వ్యాక్సిన్‌ ఎక్కువగా ఎవరికి అవసరముంటుందో వారికే ముందుగా వ్యాక్సిన్‌ అందించాలని 79శాతం మంది కోరారు.

ఇవీ చదవండి..

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

ఐపీఎల్‌ వల్లే ఆటగాళ్లకు గాయాలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని