నా కెరీర్‌లో కష్టమైన సీన్‌ అది: సాయిపల్లవి
close
Published : 03/04/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కెరీర్‌లో కష్టమైన సీన్‌ అది: సాయిపల్లవి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ‘ఫిదా’ చేసేసింది సాయిపల్లవి. సహజత్వం నిండిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రీడ్‌ పిల్ల’ అంటూ ‘ఫిదా’లో కుర్రకారుకు మత్తెక్కించింది. తెలుగులో తొలి చిత్రమే అయినా,  తెలంగాణ అమ్మాయిగా భానుమతి పాత్రలో అదరగొట్టేసింది. అంతేకాదు, సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకొని ‘వహ్వా’ అనిపించింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకుంది. ముఖ్యంగా తాను ట్రాక్టర్‌ నడిపే సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తాను ట్రాక్టర్‌ నడిపిన సన్నివేశం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఎపిసోడ్‌ అంది. ‘‘ట్రాక్టర్‌ను మామూలుగా నేర్చుకొని రోడ్డుపై నడపడం వేరు.. దమ్ము వీల్స్‌పై బురద చేనులో ట్రాక్టర్‌ను నడపటం వేరు. ఆ సమయంలో అలా ట్రాక్టర్‌ నడుపుతూ.. సహజ హావభావాలతో నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ ఎపిసోడ్‌ పూర్తి చేసే క్రమంలో చాలా సార్లు నియంత్రణ కోల్పోయా. నా కెరీర్‌లోనే అత్యంత కష్టంగా అనిపించిన సన్నివేశం అది’’ అని ఆ సినిమా చిత్రీకరణ రోజులను గుర్తుచేసుకుంది. 

ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు నాగచైతన్యతో కలిసి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని