సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా? - sai pallavi close family member to make kollywood debut
close
Updated : 17/03/2021 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా?

చెన్నై: కథానాయిక సాయిపల్లవికి ఇంటి నుంచే పోటీ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు పోటీ ఎవరంటే.. సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌. డ్యాన్స్‌, చలాకీతనంలో అక్కతో పోటీపడే పూజా తరచూ తన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటారు. పూజా అందం, అభినయానికి ఫిదా అయిన ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ శివ.. తాను దర్శకత్వం వహించనున్న మొదటి సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. శివ చెప్పిన కథ నచ్చడంతో కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు పూజా కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు స్థానిక పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సాయిపల్లవికి ఇంటి నుంచి పోటీ మొదలైందని కోలీవుడ్‌లో అందరూ చెప్పుకుంటున్నారు.

ఇక, సాయిపల్లవి విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ‘విరాటపర్వం’, ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’కి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు విప్లవ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ‘విరాటపర్వం’ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. ఇవే కాకుండా ‘వేదాళం’ రీమేక్‌తోపాటు ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లోనూ సాయిపల్లవి కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని