‘అయ్యప్పన్‌...’ రీమేక్‌: హీరోయిన్లు ఫిక్సయ్యారా? - sai pallavi play rana wife role in ayyappanum koshiyum telugu remake
close
Published : 13/01/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అయ్యప్పన్‌...’ రీమేక్‌: హీరోయిన్లు ఫిక్సయ్యారా?

హైదరాబాద్‌: మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. మలయాళంలో బిజుమేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించి పాత్రలను తెలుగులో పవన్‌కల్యాణ్‌, రానా పోషిస్తున్నారు. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు పూర్తి కాగా, సంక్రాంతి పండగ వెళ్లగానే, సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌లుగా ఎవరు నటిస్తారన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో ఐశ్వర్యరాజేశ్‌, సాయిపల్లవి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. పవన్‌కు జోడీగా ఐశ్వర్య, రానా సరసన సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అంతేకాదండోయ్‌ ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..!

సుమంత్‌ ఆ కేసును ఎందుకు టేకప్‌ చేశాడు?

రూ.85లక్షల బడ్జెట్‌.. రూ.15కోట్ల కలెక్షన్స్‌

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని