పవన్‌ భార్యగా సాయిపల్లవి! - sai pallavi playing pawan kalyans wife
close
Published : 03/03/2021 23:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ భార్యగా సాయిపల్లవి!

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనమ్‌ కోషియం’ చిత్రానికి ఇది రీమేక్‌. ఇందులో సాయి పల్లవి - పవన్ కల్యాణ్‌ భార్యగా నటించనుందని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఏప్రిల్‌ నెలలో జరగబోయే షెడ్యూల్లో పవన్‌ - సాయి పల్లవిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని వార్తలొస్తున్నాయి. ‘పీఎస్‌పీకే30’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రానా ఇందులో మాజీ హవల్దార్‌గా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో పవన్‌ - రానాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్‌ రానా సరసన నటిస్తోంది. చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూరుస్తుండగా, తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి..  ‘లవ్‌స్టోరీ’, ‘విరాట్‌ పర్వం’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాల్లో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని