బన్నీకి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌? - saiee manjrekar to act with allu arjun in koratala siva film
close
Published : 16/01/2021 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీకి జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ ఎంపికైనట్లు సమాచారం. బాలీవుడ్‌లో ‘దబాంగ్‌3’లో సల్మాన్‌ సరసన ఆమె ఆడిపాడింది. తెలుగులో అడవి శేష్‌ ‘మేజర్‌’లో కనిపించనుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బన్ని ‘పుష్ప’ షూట్‌, కొరటాల ‘ఆచార్య’ సినిమా పూర్తవగానే వీరి కాంబినేషన్‌లో #AA21 పట్టాలెక్కనుంది.

ఇవీ చదవండి

కేజీయఫ్‌-2 రోరింగ్‌.. ఆర్జీవీ పంచ్‌

అవసరాల కోసం ఆ డబ్బు వాడేసిన రవితేజమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని