హోమీ బాబాగా సైఫ్‌ అలీఖాన్‌? - saif ali khan to play homi bhabha
close
Published : 02/05/2021 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోమీ బాబాగా సైఫ్‌ అలీఖాన్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: కెరీర్‌లో విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ అలరిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌. మల్టీస్టారర్‌ సినిమాల్లో తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆదిపురుష్‌’లో  రావణ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి ససన్‌ కథానాయిక. సైఫ్‌ త్వరలో అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబాగా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రానికి విక్రమ్‌జిత్ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారట. ‘రాయ్‌’, ‘నేచర్‌’వంటి చిత్రాలకు విక్రమ్‌ దర్శకత్వం వహించారు. న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ హోమి బాబా జీవితాధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితం కానుంది.

ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని సమాచారం. నాటి అణు శాస్త్రవేత్త హోబీ బాబాకి సంబంధించిన చిత్ర షూటింగ్‌ని ఇండియాతో పాటు లెబనాన్‌లోని బీరట్‌లోనూ చిత్రీకరణ చేయనున్నారట. సైఫ్‌ 2020లో వచ్చిన ‘జవానీ జానేమన్’ చిత్రంలో ఉమనైజర్‌ పాత్రలో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం ఆయన ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’, ‘భూత్‌ పోలీస్‌’ సినిమాల్లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని