అందుకే మాస్క్‌ పెట్టుకోలేదు: సైఫ్‌ అలీ ఖాన్‌ - saif responded for trolling because of not wearing mask
close
Updated : 21/07/2020 22:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే మాస్క్‌ పెట్టుకోలేదు: సైఫ్‌ అలీ ఖాన్‌

ముంబయి: బాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నటుడు సైఫ్‌ అలీఖాన్‌. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి సతీమణి.. బాలీవుడ్‌ అగ్రకథానాయకురాలు కరీనా కపూర్‌, పిల్లలతో కలిసి బాంద్రాలోని వారి నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఇటీవల అన్‌లాక్‌ అమలు చేయడంతో సరదాగా సైఫ్ కుటుంబమంతా మెరైన్‌ డ్రైవ్‌ వద్దకు వెళ్లింది.  ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అయితే వాటిని చూసిన నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఎందుకంటే సైఫ్, కరీనా, పిల్లలు మాస్కులు ధరించకుండా మెరైన్‌ డ్రైవ్‌లో తిరిగారు. సమాజంలో గొప్ప పేరున్న మీరు ఇలా మాస్కులు ధరించకుండా బయటకు వస్తారా? బాధ్యత ఉండక్కర్లా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నెటిజన్ల విమర్శలపై సైఫ్ అలీఖాన్‌ తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మెరైన్‌ డ్రైవ్‌ ఘటనపై వివరణ ఇస్తూ ‘‘కరోనా విషయంలో మేం తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఆ రోజు మాస్కులు ధరించే అక్కడికి వెళ్లాం. అక్కడ ఎవరూ లేకపోవడంతోనే మాస్కులను తీసేశాం. అయితే కాసేపటికే జనాలు రావడంతో మళ్లీ మాస్కులు ధరించాం. మాస్కులు తీసింది వైరల్ అయింది.. కానీ మాస్కులు ధరించిన విషయం ఎవరూ చెప్పలేదు. మేమూ బాధ్యతగల, చట్టాలను గౌరవించే పౌరులమే. లాక్‌డౌన్‌ సమయంలో మేం ఇంట్లోనే ఉన్నాం. ఇప్పటికీ కొద్ది మంది కుటుంబసభ్యులనే కలుస్తున్నాం’’అని సైఫ్ తెలిపారు. 

లాక్‌డౌన్‌కి ముందు సైఫ్ ‘జవానీ జానీమన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘దిల్‌ బెచారా’, ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’, ‘భూత్‌ పోలీస్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘దిల్‌ బెచారా’ ఓటీటీలో విడుదలవుతుండగా.. మిగతా సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. సైఫ్ కూడా ఓటీటీ కోసం ‘దిల్లీ’ అనే వెబ్‌సిరీస్‌ తీస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని