సైనా బయోపిక్‌ థియేటర్లలోనే - saina nehwal biopic will come in theatres only
close
Published : 01/03/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైనా బయోపిక్‌ థియేటర్లలోనే

ముంబయి: ప్రముఖ బ్యాడ్మింటెన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవిత కథతో వస్తోన్న ‘సైనా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తొలుత ఓటీటీ వైపు చూసిన ఈ చిత్ర దర్శక-నిర్మాతలు థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారని సమాచారం.  పరిణీతి చోప్రా టైటిల్‌ పాత్రలో అమోల్‌ గుప్తా తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

ప్రభుత్వం వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో చిత్రబృందం థియేటర్లలోనే విడుదలకు సన్నాహాలు చేస్తోంది. స్పోర్ట్స్‌ బయోపిక్‌  కావడంతో థియేటర్లలో అయితేనే ప్రేక్షకులు ఈ   సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారని చిత్రబృందం భావిస్తోంది. మార్చి 26న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్‌. పరిణీతి నటించిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆమె నటించిన మరో చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ పరార్‌’ మార్చి 19న విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని