‘సైనా’ రాకెట్‌తో పరిణీతి! - saina teaser
close
Updated : 04/03/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!

ముంబయి: బయోపిక్‌లు తెరకెక్కించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా అది క్రీడా నేపథ్యమున్నదైతే కత్తి మీద సామే.  భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ విజయయాత్రను ‘సైనా’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.  ఈ చిత్రానికి అమోల్‌గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు.

‘నా దేశంలోని అందరు ఆడవాళ్లు 18 ఏళ్లకు పెళ్లి చేసుకుని వంటింట్లో గరిటె పట్టుకుంటే నేను మాత్రం కత్తి పట్టాను’ అంటూ వాయిస్‌ ఓవర్‌లో వస్తున్న పరిణీతి డైలాగ్స్‌కు తోడు బ్యాడ్మింటన్‌ కోర్టులో రాకెట్‌ పట్టుకుని ఆమె కనిపిస్తున్న దృశ్యాలు రోమాంచితంగా ఉన్నాయి. సైనా లుక్స్‌ కోసం పరిణీతి చాలా శ్రమ పడింది. ప్రత్యేకంగా బ్యాడ్మింటన్‌లో కోచింగ్‌ తీసుకుంది. అలాగే సైనాకు ఉన్నట్టే ముఖంపై పుట్టుమచ్చతో కనిపిస్తోంది. మార్చి 26 దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ద్వారా హైదరాబాద్‌ అకాడమీ నుంచి ఒలింపిక్స్‌  దాకా సైనా నెహ్వాల్‌ విజయయాత్రను చూపించనున్నారు. మరి లేటెందుకు ఆ టీజర్‌ను మీరు చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని